వేణుమాధవ్ ఇక లేరు

వేణుమాధవ్ ఇక లేరు

0
85

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్ యశోద ఆసుపత్రిలో మృతి చెందారు. ఈరోజు ఉదయం నుంచి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్సకోసం ఆయన్ను హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. ఆయనకు వెంటిలేటర్ ద్వారా స్వాస అందించారు కానీ దురదృష్టవ షాత్తు ఆయన ఈ రోజు మరణించారు.

వేణు మాధవ్ కు ఈనెల 6వ తేదిన కాలేయం సంబంధిత వ్యాధి చికిత్స తీసుకున్నారు. తాజాగా ఆ సమస్య తీవ్రం కావడంతో రెండురోజుల క్రితం రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా తయారు కావడంతో ఆయన ఈరోజులు యశోద ఆసుపత్రిలో మరణించారు.

ఆయన మరణ వార్త విన్న చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో వేనుమాధవ్ టీడీపీ తరపున ప్రచారం చేసేవారు.