Venu Swamy about Sreeja: శ్రీజ మూడో పెళ్లి అతడితోనే.. కుండబద్దలు కొట్టిన వేణుస్వామి

-

Venu Swamy Comments on Chiranjeevi’s Daughter Sreeja 3rd Marriage:సెలబ్రిటీల జాతకాలు చెబుతూ సంచలనాలు క్రియేట్ చేస్తుంటారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి. వారికి జరగబోయే మంచి విషయాలు చెబితే ఓకే. కానీ ఈయన వారికి జరిగే చెడు ప్రభావాల గురించే ఎక్కువగా ప్రస్తావిస్తూ సదరు సెలబ్రిటీల ఆగ్రహానికి గురవుతుంటారు. తాజాగా వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్ ని కలవరపెడుతున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ల వ్యవహారం వారిని విమర్శలు ఎదుర్కొనేలా చేస్తుంటే బాబాయి బాటలోనే అమ్మాయి వివాహాలు ఉంటాయని వేణు స్వామి బాంబు పేల్చారు.

- Advertisement -

ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ… ఎవరి స్థానంలో అయితే గురుడు బలహీనంగా ఉంటాడో వారికి 3 లేదా నాలుగు పెళ్ళిళ్ళు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. పవన్ కళ్యాణ్, శ్రీజ ఇద్దరి జాతకంలోనూ గురుడు బలహీనంగా ఉన్నాడని, అందుకే వారు 3 లేదా నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటారని తేల్చి చెప్పాడు. గత కొంతకాలంగా శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్ కి దూరంగా ఉంటుంది. దీంతో వీరిద్దరూ విడిపోయారనే వార్తలు గుప్పుమన్నాయి. సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ చేస్తున్న పోస్టులు ఆ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆమె జాతకంపై స్పందించిన వేణు స్వామి(Venu Swamy about Sreeja).. శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతోందని ఖరాఖండిగా చెప్పారు. ఆమె పెళ్లి చేసుకోబోయేది కూడా ఎవరో కాదు.. స్నేహితుడేనంటూ కుండబద్దలు కొట్టారు. మరో రెండు నెలల్లో ఆమె మూడో వివాహం జరుగుతుందని జోస్యం చెప్పారు. అయితే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకునేవారిపై ఎవరూ విమర్శలు చేయాల్సిన అవసరం లేదన్నారు. అది వారి వ్యక్తిగతమని చెప్పారు. కావాలని ఎవరు మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకోరని, కొంతమంది జాతకంలో ఉన్న దోషాల వల్ల అలా జరుగుతుంటాయని వివరించారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...