Venu Swamy | రాంచరణ్ దంపతుల విషయంలో వేణు స్వామికి దిమ్మతిరిగే షాక్

-

వేణుస్వామి(Venu Swamy).. సోషల్ మీడియాలో ఈ పేరుకి ఉన్న క్రేజ్ మరే సెలబ్రిటీకి కూడా ఉండదేమో. అంతలా పాపులర్ ఈ మోడ్రన్ జ్యోతిష్యుడు. సెలబ్రిటీల జాతకాలను అవపోసన పట్టినట్టు, వారి జీవితంలో ఎప్పుడు ఏ మలుపు చోటు చేసుకుంటుందో.. గుక్క తిప్పకుండా చెప్పిన వేణుస్వామి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉంటాయి. యాదృచ్ఛికమో, ఆయన అదృష్టమో తెలియదు కానీ చాలాసార్లు ఆయన చెప్పినవి చెప్పినట్టు జరిగాయి. కానీ రాంచరణ్-ఉపాసన విషయంలో అయ్యగారి ప్రెడిక్షన్ రివర్స్ అయింది. దీంతో మెగా అభిమానులు వేణుస్వామి పై విరుచుకుపడుతున్నారు.

- Advertisement -

రామ్ చరణ్ దంపతులకు పెళ్ళి అయిన పదకొండేళ్ల తర్వాత ఆడబిడ్డ జన్మించింది. అయితే, ఉపాసనకి ప్రెగ్నెన్సీ రాకముందు అభిమానులు మెగా వారసుడు/వారసురాలి ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురు చూశారు. ఆ సమయంలో మెగా ఫ్యామిలీ సభ్యుల జాతకాలు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన వేణు స్వామి.. రామ్ చరణ్ ఉపాసనల సంతానం గురించి తనదైన శైలిలో, చాలా కాన్ఫిడెంట్ గా ఓ విషయం చెప్పారు. ఇప్పుడు ఆయన ప్రెడిక్షన్ రాంగ్ అవడంతో అపహస్యం పాలవుతున్నారు వేణుస్వామి.

రామ్ చరణ్ కి సంతానయోగం ఎప్పుడు ఉండబోతుంది అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. అది కొంచెం కాంట్రవర్షియల్, సహజసిద్ధమైన సంతానయోగం కష్టం అంటూ చెప్పుకొచ్చారు వేణుస్వామి. ఈరోజుల్లో అద్దె గర్భం కామన్ అయిపోయింది. సరోగసి ద్వారా పిల్లల్ని కనడం కామన్ కదా అంటూ రాంచరణ్ ఉపాసన దంపతులను ఉద్దేశించి మాట్లాడారు వేణుస్వామి. అంటే రామ్ చరణ్ దంపతులకు సహజసిద్ధమైన సంతానం కలగదు, వారు సరోగసి ద్వారా పిల్లల్ని కంటారు అని అర్థం వచ్చేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వేణుస్వామి.

అయితే వారి విషయంలో వేణుస్వామి చెప్పిన జ్యోతిష్యం తప్పయింది. ఉపాసన సహజసిద్ధంగా గర్భం దాల్చింది. 9 నెలలు చాలా యాక్టివ్ గా, సంతోషంగా కడుపులో బిడ్డను మోసి… నార్మల్ డెలివరీ ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తన ప్రెగ్నెన్సీ ని ఎంతో ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంది ఉపాసన. కడుపులో బిడ్డ, తను ఆరోగ్యంగా ఉండడానికి ఆహారపరంగా, సరైన వ్యాయామం చేస్తూ.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. ఆ కారణంగానే ప్రెగ్నెన్సీ సమయంలోనూ, డెలివరీ తర్వాత తల్లి బిడ్డ ఎంతో యాక్టివ్ గా ఉన్నారని డాక్టర్లు కూడా చెప్పారు.

ప్రస్తుతం వేణుస్వామి(Venu Swamy) గతంలో చేసిన వ్యాఖ్యల తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో మెగా అభిమానులు వేణుస్వామిని చెడుగుడాడేసుకుంటున్నారు. ఈయన చెప్పేవన్నీ అబద్ధాలు అని ఈ వీడియోతో రుజువైందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపై వేణు స్వామి చేసే వ్యాఖ్యలు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని చర్చించుకుంటున్నారు.

Read Also: చాణక్య నీతి: ఆ విషయంలో పురుషులకంటే స్త్రీలకే కోరిక ఎక్కువ

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...