ర‌వితేజ రామారావు ఆన్ డ్యూటీలో వేణు తొట్టెంపూడి

Venu Thottempudi in Ravi tejas ramarao onduty movie

0
97

టాలీవుడ్ లో హీరోగా త‌న‌కంటూ ప్ర‌త్యేక స్ధానం సంపాదించుకున్న వేణు తొట్టెంపూడి కొద్ది కాలంగా సినిమా ప‌రిశ్ర‌మ‌కు దూరంగా ఉంటున్నారు. ఫ్యామిలీ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా ఉన్న ఆయ‌న ఇటు కామెడీ కూడా పండించ‌గ‌ల‌రు. స్వయం వరం వంటి హిట్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
చింతకాయల రవి సినిమాలో నటించారు . ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమాలో చిన్న పాత్రలో కనిపించి మెప్పించారు.

అయితే తాజాగా ఆయ‌న మాస్ మహారాజ్ రవితేజ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. ఇక రవితేజ 68వ చిత్రంగా రామారావు ఆన్ డ్యూటీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఓ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నార‌ని తెలుస్తోంది. తాజాగా రామారావు కోసం మరో హీరో డ్యూటీలో చేరుతున్నట్టు ప్రకటించారు. శరత్ కుమార్ మండవ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక ఈ సినిమా వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. మజిలి ఫేమ్ దివ్యాన్ష కౌశిక్, మలయాళ నటి రజీషా విజయన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇక మూవీకి సంగీత బాణీలు ఇస్తుంది సామ్ సిఎస్.