ఐస్ క్రీమ్ 3 కి సిద్ధమవుతున్న వర్మ- టాలీవుడ్ టాక్

Verma preparing for Ice Cream 3 Movie - tolly wood talk

0
113
RGV

రామ్ గోపాల్ వర్మ వేగంగా ఈ మధ్య సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. హిట్లు ఫ్లాఫ్ లు ఆయన పెద్ద పట్టించుకోరు. కొత్తదనం ఆయన సినిమాల్లో కనిపిస్తుంది. అందుకే ఆర్జీవి కి దేశ వ్యాప్తంగా అంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న గ్రేట్ డైరెక్టర్లు చాలా మంది ఆర్జీవీ దగ్గర వర్క్ చేసిన వారే. సినిమాల్లో అనేక ప్రయోగాలు చేస్తారు కాబట్టే ఆర్జీవి సినిమాల్లో కొత్త దనం కనిపిస్తుంది.

ఆయన సినిమాల కోసం ఎదురుచూసేవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. తాజాగా టాలీవుడ్ లో ఓ వార్త వినిపిస్తోంది. ఐస్ క్రీమ్ ఫ్రాంచైజీలో మూడవ సినిమా కోసం ఆయన రంగంలోకి దిగాడనేదే ఆ వార్త. ఇక ఈ సినిమా యూత్ ని ఎంతలా ఆకట్టుకుందో తెలిసిందే. వర్మ దర్శకత్వంలో 2014లో వచ్చిన ఐస్ క్రీమ్ సినిమా యూత్ కి బాగా నచ్చింది.

నవదీప్ – తేజస్వి – మృదుల ఇందులో కీలక పాత్రలు పోషించారు. మంచి పేరు వచ్చింది ఈ చిత్రానికి .ఆ తరువాత కొంత గ్యాప్ తోనే వర్మ ఐస్ క్రీమ్ 2 సినిమాను రిలీజ్ చేశాడు. జేడీ చక్రవర్తి ,నవీన, నందు,గాయత్రి గుప్తా కీలక పాత్రలు చేశారు. ఇక తాజాగా మూడో చిత్రం ఐస్ క్రీమ్ 3 తీయాలి అని ప్లాన్ లో ఉన్నారట. త్వరలోనే ప్రకటన రానుంది అంటున్నారు.