బిగ్ బాస్ సీజన్-4 ఇక కేవలం రెండు వారాలు మాత్రమే ఉంది… ఈ వారం ఒకరు హౌస్ నుంచి బయటకు వస్తారు, ఇక హౌస్ లో మిగిలేది ఐదుగురు మాత్రమే.. మరి టైటిల్ విన్నర్ ఎవరు అనేదానిపై చర్చ జరుగుతోంది.. సో ఇప్పటికే అభిజిత్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది, టైటిల్ విన్నర్ అతనే అని పేరు వినిపిస్తోంది.
ఇక చాలా మంది సెలబ్రెటీలు కూడా అతని పేరు చెబుతున్నారు, ఇక హౌస్ లో ఇప్పటికి ఆరుగురు ఉన్నారు,. అభిజిత్, సొహైల్, అఖిల్, హారిక, మోనల్, అరియానా మరి ఈ వారం అందరూ నామినేట్ అయ్యారు.. ఎలిమినేట్ ఎవరు అవుతారో చూడాలి ఇక అఖిల్ ఫైనల్ కు వెళ్లినట్లే.
ఈ సమయంలో అరియానా కి సపోర్ట్ చేయాలి అని తెలిపారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ..
అరియానాకు ఓటు వేసి గెలిపించాలని అభిమానులను కోరాడు. బిగ్ బాస్ విజేతగా నిలిచే అర్హత అరియానాకు ఉందని ట్వీట్ చేశాడు, దీంతో వర్మ అభిమానులు కూడా చాలా మంది ఆమెకి మద్దతుగా సపోర్ట్ చేస్తున్నారు, ఇక వర్మ ఇంటర్వ్యూ తర్వాత అరియానా బాగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే.
వర్మ ట్వీట్ ..
VOTE and MAKE ARIYANA WIN ..TRULY DESERVING in BIG BOSS ???