విక్టరీ వెంకటేష్ మంచి ఫ్యామిలీ సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్ లు అందుకున్నారు, అంతేకాదు ఇప్పటీకీ అదే జోష్ తో ఆయన సినిమాలు చేస్తున్నారు, ఇక రకరకాల పాత్రలు చేస్తూ అన్నీ వర్గా ల ప్రేక్షకులకి దగ్గర అయ్యారు ఆయన, ఇక కొత్తదనం చూపించాలి అని అనుకునే దర్శకులు వెంకటేష్ కి ముందు పాత్ర స్టోరీ చెబుతారు.. అది నచ్చితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు ఆయన.
తాజాగా ఆయన నారప్ప సినిమా చేస్తున్నారు, ఈ సినిమా తర్వాత వెంకటేష్ ఎఫ్ 3 సినిమా చేయనున్నారు, అయితే తాజాగా ఆయన మరో చిత్రాన్ని కూడా ఒకే చేశారు అని తెలుస్తోంది. ఇందులో ఆయన కాలేజీ లెక్చరర్ పాత్ర చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.
పెళ్లిచూపులు ఈ నగరానికి ఏమైంది ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకటేశ్ ఓ చిత్రాన్ని చేయడానికి ఓకే చెప్పారు. అయితే ఈ సినిమాలో ఆయన లెక్చరర్ పాత్ర చేయనున్నారు అని వార్త వినిపిస్తోంది. ఈ సినిమాకి సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత సురేశ్ బాబు నిర్మాతగా ఉండనున్నారు, ఇక కాలేజీలో సరదా కామెడీతో ఇలా కథని డవలప్ చేశారట, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.