విద్యాబాలన్ బాలీవుడ్ లో ఎంతో పేరు సంపాదించుకున్న హీరోయిన్. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకపోయినా తన నటనతో ఎంతో పేరు సంపాదించుకున్నారు. గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యం ఇవ్వకుండా. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి బాలీవుడ్ లో ఎంతో గొప్ప పేరు సంపాదించింది విద్యాబాలన్.
ఆమె నటించిన లెటేస్ట్ చిత్రం షేర్నీ మరికొన్ని రోజుల్లో ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమా పరిశ్రమలో తాను ఎలా ఎంట్రీ ఇచ్చింది తన సంపాదన గురించి తాజాగా ఇంటర్వ్యూలో విద్యాబాలన్ తెలిపారు.
ఓ టూరిస్ట్ క్యాంపైన్ కోసం మొదటిసారి కెమెరా ముందుకు వచ్చింది. తన సొదరి, మరో కజిన్ ఫ్రెండ్ తో కలిసి టూరిస్ట్ క్యాంపైన్ ఫోటోషూట్ లో పాల్గొన్నారు. ఇక దాని కోసం ఆమెకి 500 ఇచ్చారట. అదే నా తొలి సంపాదన అంటూ చెప్పుకోచ్చారు విద్యాబాలన్. తర్వాత ఓ సీరియల్ లో నటించింది.