అంగరంగవైభవంగా జరిగిన విఘ్నేష్, నయనతార వివాహం..

0
85

లేడీ సూపర్ స్టార్ నయనతార ఎన్నో సినిమాలలో నటించి ఎనలేని గుర్తింపు సాధించుకున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా మంచి అర్ధం ఉన్న కథలను ఎంచుకొని ప్రేక్షకులను తనసొంతం చేసుకుంది. విగ్నేష్‌ శివన్‌ కూడా దర్శకుడిగా మనకు పరిచయం అయ్యి నయనతారతో ప్రేమలో పడ్డాడు. అయితే వీరిద్దరి ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

వీరిద్దరూ గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే. వీరికి ప్రేమకు ముగింపు పలుకుతూ..వివాహ జీవితంలోకి అడుగు పెట్టారు. మనందరం ఎదురు చుసిన విధంగానే వీరి వివాహం అతిరథమహారధులు, సినీ సెలబ్రిటీలు, కుటుంబసభ్యులు, సన్నిహితులు సమక్షంలో జరిగింది.

నేడు ఉదయం 8:10 గంటలకు మహాబలిపురంలో ఉన్న షెరటాన్ లగ్జరీ హోటల్లో వీరి వివాహం జరగగా..నయనతార నుంచి విఘ్నేష్ కట్నం కింద ఎంత తీసుకున్నారు అనే విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఈ పెళ్లికి నయనతార 20 కోట్ల రూపాయల విలువ చేసే అత్యంత లగ్జరీ విలాసవంతమైన ఇంటిని విఘ్నేష్ శివన్ పేరిట రిజిస్ట్రేషన్  పూర్తి చేయించిందని సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.