రెండవ సారి వివాహం చేసుకోవడానికి సిద్ధపడిన విగ్నేష్ – నయన్..

0
106

లేడీ సూపర్ స్టార్ నయనతార ఎన్నో సినిమాలలో నటించి ఎనలేని గుర్తింపు సాధించుకున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా మంచి అర్ధం ఉన్న కథలను ఎంచుకొని ప్రేక్షకులను తనసొంతం చేసుకుంది. విగ్నేష్‌ శివన్‌ కూడా దర్శకుడిగా మనకు పరిచయం అయ్యి నయనతారతో ప్రేమలో పడ్డాడు.

వీరిద్దరూ గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకొని..ఎట్టకేలకు వీరి ప్రేమకు ముగింపు పలుకుతూ..వివాహ జీవితంలోకి మూడుముళ్ల బంధంతో అడుగుపెట్టారు. సన్నిహితులు, స్నేహితులు, సినీ సెలబ్రిటీల మధ్య వీరి వివాహం గ్రాండ్ గా జూన్ 9వ తేదీన వీరిద్దరి వివాహం షెరటాన్ పార్క్ గ్రాండ్ హోటల్ మహాబలిపురంలో జరిగింది. ఇక వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.

నయనతార తల్లిదండ్రులు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతుండడంతో వీరి పెళ్లికి హాజరు కాలేకపోయామని బాధపడుతున్నారు. దాంతో విగ్నేష్ – నయన్ వీరిద్దరి సమక్షంలో మరోసారి చెన్నైలో పెళ్లిచేసుకోవడానికి సిద్దపడుతున్నట్టు సమాచారం తెలుస్తుంది. అంతేకాకుండా కొచ్చిన్ లో  తమ హనీమూన్ ని కూడా పూర్తి చేసుకొని తిరిగి వస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.