సూపర్ ప్లాన్ వేసిన విజయ్ దేవర కొండ

సూపర్ ప్లాన్ వేసిన విజయ్ దేవర కొండ

0
92

అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ వరుస సక్సస్ లతో దూసుకుపోతున్నాడు, ఇటీవల కొత్త ఇంటిని నిర్మించుకున్నాడు ఈ యూత్ స్టార్. అయితే ఈ ఏడాది డియర్ కామ్రేడ్ సినిమా వచ్చింది. ఇక వరల్డ్ ఫేమస్ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని అనుకున్నారు.. కాని ఈ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరికి మార్చాడు. అయితే ఈ ఏడాది కేవలం తన అభిమానులకు ఒక సినిమా ట్రీట్ ఇచ్చాడు ..కాని వచ్చే ఏడాది వరుసగా సినిమాలు లైన్ లో పెడుతున్నాడు అని తెలుస్తోంది.

ఇప్పటికే విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ తో ఫైటర్ సినిమాతో సెట్స్ మీదకెళ్ళబోతున్నాడు. ఇక మజిలీ దర్శకుడు శివ నిర్వాణతో మరో సినిమాకి కమిట్ అయ్యారు. తాజాగా దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నాడట, ఈ సినిమా హుషారు దర్శకుడితో చేయనున్నారు అని తెలుస్తోంది.

పూరి సినిమాతో పాటు దిల్ రాజుకి కమిట్ అయిన సినిమా కూడా ఒకే సారి చేయాలి అని చూస్తున్నారు విజయ్.. తర్వాత ఈ రెండు ఫినిష్ చేసి మజిలీ డైరెక్టర్ శివతో సినిమా పట్టాలెక్కిస్తారు అని తెలుస్తోంది. వచ్చే ఏడాదికి మూడు సినిమాలు పక్కా చేసుకున్నాడు విజయ్ దేవరకొండ.