Hatya Trailer | విజయ్ ఆంటోని(Vijay Antony) ప్రధాన పాత్రలో నటించిన బిచ్చగాడు చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ అయినా తెలుగులో అద్భుతమైన కలెక్షన్లతో సత్తా చాటింది. అప్పుడు విడుదలైన తెలుగు సినిమాలతో పాటు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా మాంచి లాభాలు తెచ్చిపెట్టింది. అయితే, ఇటీవల ఈ సినిమాకు సీక్వెల్ వచ్చింది. అనుకున్నంత సక్సెస్ కాకపోయినా పర్వాలేదనిపించింది. తాజాగా.. మరో కొత్త సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు విజయ్ ఆంటోని. హత్య(Hatya Trailer) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇవాళ(జులై 18) హత్య సినిమా ట్రయిలర్‌ను విడుదల చేశారు. రితికా సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్ నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 21న థియేటర్లలో విడుదల కానుంది.
Hatya Trailer | బిచ్చగాడు హీరో కొత్త సినిమా ట్రయిలర్ విడుదల
-