విజయ్ కథానాయకుడిగా అట్లీ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. తాజాగా ఈ సినిమాకి ‘బిజిల్’ అనే టైటిల్ ను ఖరారు చేసి, ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. విజయ్ పుట్టినరోజు నిన్న .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు.
ఇందులో విజయ్ ఫుట్ బాల్ కోచ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇదివరకు ఈయన విజయ్ తో తెరకెక్కించిన ‘తెరీ’.. ‘మెర్సల్’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ఇందులో ‘మెర్సల్’ కోసం ఏకంగా మెడికల్ మాఫియాను కదిలించాడు దర్శకుడు అట్లీకుమార్. ఇక ఇప్పుడు ఏకంగా ఒలంపిక్స్‌నే టార్గెట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఫుట్ బాల్ కోచ్‌గా నటిస్తున్నాడు విజయ్. ఇందులో కూడా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు దళపతి. ఈ సినిమాలో సాకర్ టీం కోసం 16 మంది అమ్మాయిలను తీసుకున్నాడు దర్శకుడు అట్లీ. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చింది.