ఈ సినిమా లో విజయ్ పాత్ర అద్భుతమట..!!

ఈ సినిమా లో విజయ్ పాత్ర అద్భుతమట..!!

0
103

డియర్ కామ్రేడ్ తో మరో సక్సెస్ ని అందుకున్న విజయ్ దేవరకొండ తాజాగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజబెల్లా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.. అధికభాగం పారిస్‌లో షూట్ జరుపుకోగా, విజయ్ దేవరకొండ గడ్డం పెంచుకుని హార్ట్ బ్రేక్ అయిన ఒక ఫెయిల్యూర్ లవర్‌లా కనిపిస్తాడని టాక్..

అయితే ఈవిధంగా విజయ్ కనిపించడం కొత్త కాకపోయినా కథ కథనం ఈ పాత్ర కు కనెక్ట్ అయ్యేలా ఉంటుందని అంటున్నారు.. కాలేజ్ స్టూడెంట్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, బైక్ రేసర్, మధ్య తరగతి వ్యక్తి పాత్రల్లో విజయ్ కనిపించబోతున్నాడట. నాలుగు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో విజయ్ కనిపించడం మొదటిసారి అయినా ఆ ఫీట్ చేయడం గొప్పే అంటున్నారు.. ఇక ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.