విజ‌య్ దేవ‌ర‌కొండ‌- జాన్వీక‌పూర్ క‌ర‌ణ్ సెట్ చేశాడుగా

విజ‌య్ దేవ‌ర‌కొండ‌- జాన్వీక‌పూర్ క‌ర‌ణ్ సెట్ చేశాడుగా

0
89

విజయ్ దేవరకొండ త్వరలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఫైటర్ అనే సినిమా త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది, ఈ సినిమా బాలీవుడ్ లో కూడా ప్లాన్ చేస్తున్నారు.. అయితే హీరోయిన్ కోసం వెతుకులాట చేస్తున్నారు పూరీ. మ‌రో ప‌క్క ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ ప‌ని జరుగుతోంది.

హిందీ వెర్షన్ ను ప్రెజెంట్ చేసేందుకు బాలీవుడ్ కరణ్ జోహార్ ముందుకు వచ్చారు, తాజాగా హీరోయిన్ విష‌యం కూడా ఆయ‌న‌కే అప్ప‌గించారు పూరీ జ‌గ‌న్నాథ్.. ఈ సినిమాలో హీరోయిన్ గా అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్విని ఫైనలైజ్ చేశారట. అయితే సినిమాల్లో క‌ర‌ణ్ ఆమెకు లైఫ్ ఇచ్చారు అందుకే ఆమెని అడ‌గ‌గానే విజ‌య్ తో ఆమె సినిమాకి ఒప్పుకుంద‌ట‌.

గ‌తంలో జాన్వీ విజ‌య్ పై ప్ర‌శంస‌లు చేసింది.. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండకు ఫ్యాన్ గా మారిపోయానని చెప్పింది. అందుకే ఈ సినిమాకు జాన్వి సైన్ చేసి ఉండొచ్చని అంటున్నారు. మొత్తానికి విజ‌య్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు