ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ

Vijay Devarakonda kept his word

0
85

హీరో విజయ్ దేవరకొండ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఏమిటి ఆయ‌న ఇచ్చిన మాట అనుకుంటున్నారా? అది తెలుసుకుందాం. ఇండియన్ ఐడల్ సీజన్ 12లో అద్భుతంగా రాణించిన తెలుగు తేజం షణ్ముఖ ప్రియకు తన లైగర్ చిత్రంలో పాట పాడే అవకాశం ఇచ్చారు. సోష‌ల్ మీడియాలో ఈ విష‌యం తెలిపారు ఆయ‌న. షణ్ముఖ ప్రియను కలిసిన ఫొటోలను షేర్ చేశారు.

నువ్వు ఇండియన్ ఐడల్‌లో గెలిచినా ఓడినా నువ్వు నా సినిమాలో పాడ‌తావ్ ఇది డీల్ అని వీడియో షేర్ చేశారు విజ‌య్ . ఇండియన్ ఐడల్‌లో ఆమె ట్యాలెంట్ చూసి ఈ మాట అన్నారు. ఇక తాజాగా ఆమెని క‌లిశారు ఆయ‌న‌.ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నారు.

దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగ‌ర్ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో
అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో ఓ పాట షణ్ముఖ ప్రియ పాడుతుంది. ఈ పాట త్వ‌ర‌లో విడుదల చేయ‌నున్నార‌ని తెలుస్తోంది.

https://twitter.com/baraju_SuperHit/status/1434829262935134216