విజయ్ దేవరకొండకి ఫైటర్ సెట్ చేశాడు పూరి

విజయ్ దేవరకొండకి ఫైటర్ సెట్ చేశాడు పూరి

0
115

సక్సస్ కు కేరాఫ్ అడ్రస్ అయ్యారు హీరో విజయ్ దేవరకొండ… తాజాగా ఆయన చిత్రాలు అన్నీ వరుస హిట్లు అందుకున్నాయి..విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. తర్వాత మాస్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరీ దర్శకత్వంలో ఆయన సినిమా చేయనున్నారు…ఇక ఈ సినిమాకి కథ ఇప్పటికే పూరీ సిద్దం చేశారు.ఈ సినిమాకి ఫైటర్ అనే టైటిల్ ను పూరి జగన్నాథ్ ఖాయం చేశారు.

అయితే పూరి సినిమాలు అంటే మాస్ యాక్షన్ కచ్చితంగా ఉంటుంది ..దీనికి విజయ్ దేవరకొండ యాక్టింగ్ తోడయితే బొమ్మ హిట్ అనే అంటున్నారు ఆయన ఫ్యాన్స్, మరి పూరీ మార్క్ కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది అంటున్నారు. ఈ చిత్రం అన్ని ప్రాంతాల భాషల ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేది కావడంతో, వివిధ భాషల్లో దీనిని విడుదల చేయాలనే ఆలోచనతో పూరి వున్నాడట.

అంతేకాదు ఈ సినిమా విషయంలో నిర్మాతలు కూడా భారీగా నే ప్లాన్ వేస్తున్నారు.. ఇక పలు భాషల్లో సినిమా నిర్మించేందుకు ప్లాన్ వేస్తున్నారు ..అందుకే కోలీవుడ్—- బాలీవుడ్ కి సంబంధించిన నిర్మాతలతో చర్చలు జరుపుతున్నారట, ఇక కైరా అద్వానీ ఈ సినిమాలో నటించనున్నారట. ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల కానుంది.