విజయ్ దేవరకొండకు ఓటేసిన ఆలియాభట్

విజయ్ దేవరకొండకు ఓటేసిన ఆలియాభట్

0
75

టాలీవుడ్ హీరోలకి వారి సినిమాలకు బాలీవుడ్ లో క్రేజ్ ఎప్పుడూ ఉంటుంది…ముఖ్యంగా ఓ ఐదు సంవత్సరాలుగా ఇక్కడ తారలు అక్కడ… అక్కడ తారలు ఇక్కడ కూడా మెరుస్తున్నారు. బాహుబలి చిత్రం తర్వాత చాలా మంది తారలు బాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నారు.. అక్కడ నుంచి ముద్దుగుమ్మలు ఇక్కడ సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఇక్కడ హీరోలకు ఫ్యాన్స్ అయ్యే ముద్దుగుమ్మలు బీ టౌన్ లో చాలా మంది ఉన్నారు. అందులో ఆలియా భట్ కూడా ఒకరు.

ఆలియా భట్… రాజమౌళి తీస్తున్న మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ లో నటిస్తోంది. తెలుగులో ఆమెకు ఇదే తొలిచిత్రం, ఇక ఈ సినిమాలో చెర్రీ పక్కన ఈ బ్యూటి నటిస్తోంది.
ఇటీవల ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఆలియా, మీడియాతో మాట్లాడుతున్న వేళ, మీకు ఏ హీరో స్టయిల్ నచ్చుతుందన్న ప్రశ్న ఎదురైంది. దీనికి ఆలియా వెంటనే తడుముకోకుండా విజయ్ దేవరకొండ పేరు చెప్పేసింది.

దీంతో మన రౌడీ అదేనండి విజయ్ దేవరకొండకు సూపర్ సపోర్ట్ అని చెప్పింది… ఆమెకే కాదు బాలీవుడ్ లో చాలా మందికి ఇప్పుడు అతను గ్రీకు వీరుడు అయ్యాడు
హీరోయిన్స్ లో తనకు అనుష్క శర్మ స్టయిల్ ఇష్టమని, హీరోలలో విజయ్ దేవరకొండ స్టయిల్ ఎంతో సూపర్ అని చెప్పింది. సో ఆమె మాటకి మన అర్జున్ రెడ్డి అభిమానులు థాంక్స్ చెబుతున్నారు.