విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి? ముహూర్తం ఫిక్స్!

0
109

విజయ్ దేవరకొండ, రష్మికలది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరూ జంటగా నటించిన గీత గోవిందం అంచనాలకు మించి భారీ విజయం సాధించింది. ఈ మూవీలో విజయ్, రష్మిక కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. డియర్ కామ్రేడ్ అంటూ రెండోసారి జతకట్టిన ఈ జంట మరింతగా సిల్వర్ స్క్రీన్ పై కెమిస్ట్రీ పండించారు.

విజయ్ దేవరకొండ, రష్మికల మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ డియర్ కామ్రేడ్ చిత్ర విడుదల నాటి నుండి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్లను బలపరిచేదిగా వాళ్ళ ప్రవర్తన కూడా ఉంది. రష్మిక విజయ్ దేవరకొండ ఫ్యామిలీకి రష్మిక చాలా దగ్గరయ్యారు. విజయ్ పేరెంట్స్ తో రష్మిక చాలా క్లోజ్ అండ్ కంఫర్ట్ ఫీల్ అవుతారు. ఒకటి రెండు సందర్భాల్లో విజయ్-రష్మిక తమ రిలేషన్ గురించి నోరు విప్పారు. మేము కేవలం స్నేహితులం మాత్రమే అంటూ రూమర్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.

ఇక ఈ ఏడాది న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ దేవరకొండ బ్రదర్స్ తో గోవాలో జరుపుకుంది రష్మిక. విజయ్ తో న్యూ ఇయర్ ని చాలా ప్రత్యేకంగా జరుపుకుంది. ఫ్యామిలీ గ్యాథరింగ్స్ పక్కనపెడితే విజయ్, రష్మిక డిన్నర్ డేట్స్, షాపింగ్స్ ఏకాంతంగా చేస్తారు. తరచుగా ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ ఉంటారు. తాజా మీడియా కథనాల ప్రకారం 2022 చివర్లో లేదా 2023 ప్రారంభంలో విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం చేసుకోనున్నారట. విజయ్, రష్మిక మధ్య వివాహ చర్చలు కూడా జరిగాయట. ఈ పెళ్లి వేడుకను గ్రాండ్ గా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. మరి దీనిపై వారిద్దరూ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.