విజయదేవరకొండ ఈ సారి రూట్ మార్చాడే..!!

విజయదేవరకొండ ఈ సారి రూట్ మార్చాడే..!!

0
87

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ తర్వాత క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేశ్‌, క్యాథరిన్ ట్రెసా, ఇజాబెల్లా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కె.ఎ.వల్లభ నిర్మిస్తోన్న చిత్రానికి ‘వరల్డ్ ఫేమస్ లవర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేసింది చిత్ర బృందం..

సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్‌.రామారావు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రం సెన్సిబుల్ కథాంశంతో అద్భుతంగా తెరకెక్కబోతుంది అంటున్నారు.. కాగా ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసిన మేకర్స్ సెప్టెంబర్ 20, సాయంత్రం 5 గంటలకు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు.. హైదరాబాద్‌లో చిత్రీకరణను జరుపుకుంటున్న ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు..