ఈ కరోనా సెకండ్ వేవ్ తో చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎందరో ఉద్యోగాలు ఉపాధి కోల్పోయారు. అంతేకాదు చాలా కుటుంబాలు పెద్దలను కోల్పోయాయి. అనేక మంది పిల్లలు అనాధలు అయ్యారు.ఇక చాలా రంగాలు చతికిలపడ్డాయి. అయితే ప్రభుత్వం కరోనా బాధితులని ఆదుకునేందుకు ఎన్నో చర్యలు చేపట్టింది.
ఈ సమయంలో కరోనా బాధితులకు, బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఎందరో ముందుకు వచ్చారు. అలాగే సినీ సెలబ్రిటీలు భారీ సాయాన్ని అందించారు. ఇక బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ చాలా మంది ఇలా సాయం చేశారు. భారీ విరాళాలు అందించారు. తాజాగా తమిళ నటుడు విజయ్ సేతుపతి తన మంచి మనసు చాటుకున్నారు.
కరోనా బాధితుల సహాయార్థం తమిళనాడు సీఎం సహాయనిధికి రూ. 25 లక్షల విరాళాన్ని సేతుపతి అందించారు. నేరుగా ముఖ్యమంత్రి స్టాలిన్ ని కలిసి ఈ విరాళం అందచేశారు. ఆయన చేసిన పనికి అందరూ అభినందిస్తున్నారు.