విజయ్ దేవరకొండ- పూరి సినిమా ఎప్పుడు రానుందో తెలుసా

విజయ్ దేవరకొండ- పూరి సినిమా ఎప్పుడు రానుందో తెలుసా

0
87

టాలీవుడ్ లో ఇప్పుడు మంచి క్రేజ్ ఉన్న హీరోగా విజయ్ దేవరకొండ ఉన్నారు.. ఫుల్ లవ్ ఓరియెంటెడ్ కాకుండా మాస్ క్లాస్ అందరికి నచ్చేలా హీరోగా ముద్ర వేయించుకున్నాడు, తాజాగా ఫైటర్ సినిమా చేస్తున్నాడు విజయ్, పూరీ జగన్నాథ్ దర్శకత్వంతో ఈసినిమా తెరకెక్కుతోంది, ఈ చిత్రానికి ఫైటర్ లైగర్ అనే రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.

ఇక చిత్రం పై ముందుగానే ప్లాన్ చేసుకున్న పూరీ అలాగే షూటింగ్ కు ఎక్కడా బ్రేకులు లేకుండా చేస్తున్నారు, కరణ్ జొహార్ నిర్మాణ భాగస్వామిగా మారిపోవడంతో, ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిని చేరనుంది. ఇక ఈ చిత్రం ఏకంగా 55 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మితం అవుతుంది అని తెలుస్తోంది,

బీటౌన్ టాక్ ప్రకారం, తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు, అందుకే బడ్జెట్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదట, అయితే విజయ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తోంది. టాలీవుడ్ కు ఆమె ఇలా పరిచయం కాబోతోంది. ఇక దసరా బరిలో ఈ చిత్రం విడుదల అవుతుందట.. నార్త్ సౌత్ లో కూడా అప్పుడు మార్కెట్ ఉంటుంది కాబట్టి , ఈ చిత్రం అక్టోబర్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయట.