Review: విజయ్ ‘లైగర్’ మూవీ రివ్యూ & రేటింగ్

0
99

డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లేటేస్ట్ చిత్రం లైగర్. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు (ఆగస్ట్ 25న) పాన్ ఇండియా లెవల్ లో విడుదలైంది. విజయ్ కు తల్లిగా సీనియర్ నటి రమ్యకృష్ణ, కీలక పాత్రలో మైక్ టైసన్ నటించారు. రౌడీ హీరోతో  అనన్య పాండే రొమాన్స్ చేసింది. మరి భారీ అంచనాల నడుమ రిలీజైన ‘లైగర్’ ప్రేక్షకుల మన్ననలు పొందిందా? ఈ సినిమాతో విజయ్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడా? లైగర్ తో పూరి భారీ హిట్ కొట్టాడా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

కథ:

లైగర్ (విజయ్ దేవరకొండ) మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం కోసం తన తల్లి బాలమణి (రమ్యకృష్ణ)తో కలిసి బతకడానికి ముంబై వస్తాడు. నేషనల్ ఛాంపియన్ అవ్వాలని కల కంటాడు. అనంతరం లైగర్, తాన్య (అనన్య పాండే)తో ప్రేమలో పడతాడు. మరీ లైగర్ తాను అనుకున్న గోల్ కి రీచ్ అయ్యాడా? లేదా ? అసలు మైక్ టైస‌న్ ట్రాక్ ఏమిటి ? అనేది మిగిలిన కథ.

కథనం:

పూరీ సినిమాలు ఇలా ఉంటాయి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలా ఉంటుందని ఊహించుకుని వెళ్తారో.. అదే సినిమా చూపిస్తారు పూరీ. ఇప్పుడు లైగర్ కూడా అదే. కాకపోతే ఇది పాన్ ఇండియా స్టైల్‌లో కాస్త గ్రాండ్‌గా చూపించారంతే. కాకపోతే టేకింగ్, మేకింగ్ అంతా సేమ్ టూ సేమ్ అదే పూరీ జగన్నాథే. విజయ్ లాంటి నటుడు దొరికేసరికి లైగర్ స్వరూపమే మారిపోయింది. చిన్న బడ్జెట్ తో చేయాలనుకున్న సినిమాను..పాన్ ఇండియా యాక్షన్ సినిమాగా మార్చేశారు పూరీ.  ఫస్టాఫ్ అంత యాక్షన్ సన్నివేశాలతో పాటు.. అక్కడక్కడ మదర్ సెంటిమెంట్ ఉండేలా జాగ్రత్త పడ్డాడు. ఇంటర్వెల్ కు చిన్న ట్విస్ట్ ఇచ్చి.. ఆ తర్వాత నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ కు లైగర్ ఎలా వెళ్లాడు అనే జర్నీ చూపించాడు. అందరూ ముందు నుంచి ఊహించింది క్లైమాక్స్.. ఎందుకంటే అప్పుడే మైక్ టైసన్ వచ్చేది.. దాన్ని ఊహించినంత చిత్రీకరించలేకపోయాడు పూరి జగన్నాథ్. టైసన్ లాంటి ఫైటర్ను తీసుకొచ్చి చాలా సిల్లీగా క్లైమాక్స్ ప్లాన్ చేసినట్లు అనిపిస్తుంది. చాలా రొటీన్ కథకు ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే తోడు కావడంతో లైగర్ అంత ఆసక్తికరంగా మారలేదు. కాకపోతే విజయ్ దేవరకొండ మాత్రం అద్భుతంగా నటించాడు. మొదటి సీన్ నుంచి చివరి వరకు వన్ మ్యాన్ షోలా కనిపించాడు.

ఎవరెలా చేశారంటే?

విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో అని చెప్పుకోవాలి. తనకు సరిపోయే కారెక్టర్ దొరికితే ఎలా రప్ఫాడుకుంటాడో అర్జున్ రెడ్డిలోనే చూపించేసారు. ఇప్పుడు లైగర్‌లోనూ అదిరిపోయే నటనతో ఆకట్టుకున్నారు విజయ్. పూర్తిగా ఆయన కారెక్టరైజేషన్ సినిమాకు హైలైట్. పూరీ ఈ పాత్రను డిజైన్ చేసిన తీరు కూడా అద్భుతమే. నత్తితో కూడా అదరగొట్టారు విజయ్. మార్షల్ ఆర్ట్స్‌లోనూ సత్తా చూపించారు.

అనన్యా పాండే కారెక్టర్ ఉన్నంత వరకు ఓకే.

రమ్యకృష్ణ చాలా బాగా నటించారు.

మైక్ టైసన్ పాత్రను పూరీ అదిరిపోయే డిజైన్ చేసారు. ఆయన పాత్ర సినిమాకు మెయిన్ హైలైట్.

ప్లస్ పాయింట్స్:

విజయ్ నటన

రమ్యకృష్ణ

మైక్ టైసన్

అకిడి పకిడి, కోకా కోకా సాంగ్స్

మైనస్ పాయింట్స్:

కథనం

ద్వితీయార్ధం

రేటింగ్: 2.5/5

గమనిక: ఇది సమీక్షకుని దృష్టి కోణానికి సంబంధించిది మాత్రమే..All time Report కు ఎలాంటి సంబంధం లేదు.