విజయ్ ‘లైగర్’ చెత్త రికార్డ్..లాల్ సింగ్ చద్దా కంటే కూడా..

0
122

టాలీవుడ్ రౌడీ హీరో, అర్జున్ రెడ్డితో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నారు విజయ్ దేవరకొండ. మరోవైపు డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రమే లైగర్. సాలా క్రాస్ బ్రీడ్ హ్యాష్ టాగ్. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో ఆగస్ట్ 25న రిలీజ్ అయింది.

ఈ సినిమాకు IMDB 10 కి 1.7 రేటింగ్ మాత్రమే ఇచ్చింది. ఇటీవల విడుదలై ప్లాపులుగా నిలిచిన, లాల్ సింగ్ చడ్డకు 5, రక్షాబంధన్ చిత్రానికి 4.6, దోబారకు 2.9 రేటింగ్ ఇచ్చిన IMDB లైగర్ కు మాత్రం 1.7 రేటింగ్ ఇచ్చింది. 2022 లో విడుదలైన చిత్రాలు అన్నింటిలోనూ లైగర్ దే తక్కువ రేటింగ్ కావడం గమనార్హం.