‘లైగ‌ర్’ కోసం విజ‌య్ పారితోషికం మరి ఈ రేంజిలోనా..!

0
104

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా మూవీ లైగర్. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో రౌడీ హీరో బాక్సర్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది.

పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమానుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలు సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. ‘లైగర్’ ఆగస్టు 25న విడుదలకానుంది. ఈ క్ర‌మంలో చిత్ర‌బృందం వ‌రుస ప్ర‌మోష‌న్‌ల‌తో బిజీగా ఉన్నారు.  ఇదిలా ఉంటే తాజాగా విజ‌య్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైర‌ల్‌గా మారింది.

ఈ చిత్రంలో న‌టించినంద‌కు విజ‌య్ తీసుకున్న పారితోషికం తెలిస్తే ఎవ్వరైనా అవాక్కావల్సిందే. ఈ చిత్రం కోసం విజయ్ దాదాపు 30కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్‌ను తీసుకున్నాడ‌ట‌. ఈ చిత్రం కోసం విజ‌య్ బాగానే కష్టపడ్డాడని చిత్రబృందం చెప్పుకొచ్చింది. హీరో విజయ్ ఈ స్థాయిలో రెమ్యున‌రేష‌న్ అందుకున్నాడంటే విశేషం అనే చెప్పాలి.