ఆర్ ఆర్ ఆర్ మూవీ పై వస్తున్న రూమర్ పై క్లారిటీ ఇచ్చిన విజయశాంతి

ఆర్ ఆర్ ఆర్ మూవీ పై వస్తున్న రూమర్ పై క్లారిటీ ఇచ్చిన విజయశాంతి

0
93

హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు విజయశాంతి. ఒకప్పుడు చిరంజీవి నాగార్జున కు సమానంగా విజయశాంతిని చూసేవారు. అమెలా సినీ పరిశ్రమలో రాణించాలి అను కోని నటీమణులు ఉండరు. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి, హీరోలకు ఏ మాత్రం తీసిపోని విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లడంతో పదమూడేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు.

అయితే మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు. నీకెవ్వరు సినిమాతో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు.ఇదే క్రమంలో రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కూడా విజయశాంతి నటిస్తున్నట్లు ప్రచారం కొనసాగుతోంది. అయితే ఇందులో వాస్తవం లేదని విజయశాంతి వివరణ ఇచ్చారు.

అయితే విజయశాంతి ఇక్కడ ఒక విషయం గమనించాలి. హీరోయిన్గా ఆమె సినిమా పరిశ్రమను ఒక ఊపు ఊపేస్తున్న సమయంలో ఆమెకు ఎన్నో సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చేవి. డబ్బు కోసమో లేక పేరు కోసం విజయశాంతి వరుసగా సంవత్సరానికి 18 సినిమాలు చేసి ఉండొచ్చు. కానీ నేటి పరిస్థితి అలా కాదు. ఏడాదికి ఒక మంచి సినిమా దొరికిన చాలు అనుకునే నటీమణులు ఎందరో ఉన్నారు. అవకాశం లేదని కథలు దొరక్క చిన్న సినిమాలకు కూడా సంతకాలు చేస్తూ నెట్టుకొస్తున్నారు. సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు సినిమాని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం.