విజయశాంతి మీద ఎంత ప్రేమ ఉందో బయటపెట్టిన చిరంజీవి

విజయశాంతి మీద ఎంత ప్రేమ ఉందో బయటపెట్టిన చిరంజీవి

0
98

సరిలేరు నీకెవ్వరు చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈ వెంట్ హైదరాబాద్ లో జరిగింది దీనికి చీఫ్ గెస్ట్ గా చిరంజీవి హజరయ్యారు, ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి కూడా ఓ కీలకమైన రోల్ చేశారు..సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి, లేడీ అమితాబ్ విజయశాంతి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

వారిద్దరు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. చిరంజీవి మాట్లాడుతూ విజయశాంతిపై ప్రశంసల వర్షం కురిపించారు. సండే అనకురా.. మండే అనకురా…ఎప్పటికీ నీదాన్నిరా అని అప్పట్లో మాట ఇచ్చిన విజయశాంతి 15 ఏళ్లు తనను వదిలేసి వెళ్లిపోయిందని అన్నారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు కనిపించిందన్నారు.

దాదాపు ఇద్దరం కలిసి 20 సినిమాలు చేశాం ఆ పాటలు గుర్తు వస్తున్నాయి, చాలా సరదాగా ఉండేది.. చెన్నైలో తన ఇళ్లు మా ఇళ్లు ఎదురు ఎదురుగా ఉండేవి, ప్రతీ ఫంక్షన్ కి నేను వెళ్లేవాడిని తను మా ఇంటికి వచ్చేది, 15 ఏళ్ల తర్వాత తిరిగి కెమెరా ముందుకు వచ్చినా అదే గ్లామరు కనిపిస్తోందని, ఆమెను చూస్తుంటే తన గుండె కొంచెం కిందికి జారుతోందని చిరంజీవి అనడంతో స్టేడయం నవ్వులతో హోరెత్తింది. రాజకీయాల్లోకి తనకంటే ముందు విజయశాంతి వెళ్లిందని ఈ సమయంలో గుర్తు చేశారు చిరంజీవి.