విజయశాంతి కొత్త కండిషన్లు ఇవేనట

విజయశాంతి కొత్త కండిషన్లు ఇవేనట

0
96

టాలీవుడ్ లో మొట్టమొదటిసారి కోటిరూపాయల పారితోషికం తీసుకున్న నటిగా హీరోయిన్ విజయశాంతికి పేరుంది రాజకీయాల్లో రాములమ్మ బిజీ అయిన తర్వాత సినిమాలకు దూరం అయ్యారు, అయితే మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి తాజాగా మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించారు.

ఈ సినిమాలో ఆమె కీలకమైన పాత్రను పోషించారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి విజయశాంతికి వరుసగా అవకాశాలు వస్తున్నాయట. అయితే ఇందులో ఆమె పాత్ర ఏమిటి అనేది చిత్రం వచ్చిన తర్వాత తెలుస్తుంది, అందులో ఆమె రోల్ నటన అన్నీ సినిమా బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకుల నుంచి వినిపిస్తుంది.

విజయశాంతి వుంటే తమ ప్రాజెక్టు క్రేజ్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఆమెను సంప్రదించేవారి సంఖ్య పెరుగుతోందట.. అయితే విజయశాంతి రెండు షరతులు పెడుతోందట. భారీ పారితోషికం ఇవ్వాలి అలాగే లీడ్ పాత్రలు ఉంటేనే చేస్తాను అని చెబుతున్నారట. తల్లి పాత్రలు .. అతిథి పాత్రలుచేయను అని చెబుతున్నారట.