‘విక్రమ్‌’తో దర్శకుడిగా మంచి గుర్తింపు వచ్చింది హరిచందన్‌.

-

హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో జన్మించి సినిమా రంగం మీదున్న మక్కువతో తన కల సాకారం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు యువ దర్శకుడు హరిచందన్‌. ‘విక్రమ్‌’ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు పొందారు. ‘మహావీరన్‌’గా తమిళంలో విడుదలైన ఈ చిత్రానికి అక్కడ కూడా చక్కని ఆదరణ దక్కింది. శుక్రవారం హరిచందన్‌ పుట్టినరోజు సందర్భంగా తన జర్నీ గురించి చెప్పుకొచ్చారు.

- Advertisement -

‘‘చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఆసక్తి. ఏడేళ్ల క్రితం భాష తెలియని చెన్నైలో నా సినిమా జర్నీ ప్రారంభమైంది. అలా సినిమా మీద ప్రేమ పెంచుకుని దర్శకత్వం వహించడానికి కావలసిన మెళకువలు నేర్చుకున్నా. విక్రమ్‌ సినిమాతో దర్శకుడిగా మారాను. ఓ మఽధ్య తరగతి కుర్రాడు తీసిన సినిమా విడుదలైతే చాలు వాళ్లు విజేతలు అని నమ్మి ముందుకెళ్లాను. ఈ క్రమంలో ఎన్నో పోగొట్టుకున్నప్పటికీ తెరపై సినిమా కనిపిస్తే చాలనుకున్నా. తెలుగు ప్రేక్షకులు నాకు ఆ అనుభూతి అందించారు. ఈ జర్నీలో దర్శకులు తేజ, బాబీ, సంగీత దర్శకుడు కోటి, చంద్రబోస్‌గారు ఎంతో సహకరించారు.

ఈ సినిమాను త్వరలో ఓటీటీలో కూడా విడుదల చేయనున్నాం. అయితే ఈ సినిమా కన్నా ముందు జై బాలాజీ క్రియేషన్స్‌ పతాకంపై ఆశిష్‌, వినోద్‌, పార్వతి కీలక పాత్రధారులుగా ‘మిస్టర్‌ ప్రాజెక్ట్‌ హెచ్‌’ సినిమా మొదలుపెట్టా. యాక్షన్‌ డ్రామాగా సాగే ఈ చిత్రం క్లైమాక్స్‌ మినహా షూటింగ్‌ మొత్తం పూర్తయింది. ఈ వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది. అయితే దీని కన్నా ముందు ‘విక్రమ్‌’ సినిమా విడుదలైంది. ఇప్పుడు శ్రీసాయి వెంకటేశ్వరా సినీ క్రియేషన్స్‌ పతాకంపై ఓ ప్రముఖ హీరోయిన్‌ కీలక పాత్రలో రవీంద్ర.కె నిర్మాతగా ఓ సినిమా మొదలుకానుంది. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తా’’ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...