నటి నటులు :
నాగవర్మ, దివ్య రావు, సూర్య, పృద్వి, వైజాగ్ ప్రసాద్,ఖయ్యుమ్, తాగుబోతు రమేష్, జ్యోతి, సురేష్,నట కుమారి, ఆదిత్య ఓం
టెక్నిషియన్స్ :
బ్యానర్ నేమ్ :ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్
ప్రొడ్యూసర్ :నాగవర్మ బైర్రాజు
స్టోరీ, స్క్రీన్ ప్లే,డైలాగ్స్, డైరెక్షన్ :హరి చందన్
మ్యూజిక్ డైరెక్టర్ :సురేష్ ప్రసాద్
సినిమాటోగ్రఫేర్ :వేణు మురళీధర్ వదనాల
ఆర్ట్ :బాబ్జి
కోరియోగ్రఫీ :సత్య -కపిల్ శర్మ
ఎడిటర్ :శ్రీను మెనగా
స్టోరీ :
విక్రమ్ (నాగ వర్మ ),మహా లక్ష్మి (దివ్య రావ్ ), హీరో ఫాదర్ (సీనియర్ యాక్టర్ సూర్య ), లింగేశ్ (సీనియర్ యాక్టర్ సురేష్ ), జగ్గుభాయ్ (పృథ్వి ), శాంభవి (జ్యోతి ), హర్ష (ఖయ్యుమ్ ),హీరో విక్రమ్ తండ్రి సూర్య విక్రమ్ ఉద్యోగం చేస్తూ లైఫ్ లో సెటిల్ అవ్వాలి అని కోరుకుంటాడు కాని విక్రమ్ సినిమా మీద వున్న ప్యాషన్ తో స్టోరీ లు వ్రాస్తూ ఒక ప్రొడ్యూసర్ దగ్గర పని చేస్తాడు, విక్రమ్ ఫ్రెండ్ హర్ష, హర్ష ఫ్రెండ్స్ విక్రమ్ ఫ్రెండ్స్, విక్రమ్ కి తన తండ్రి ఇదే విక్రమ్ ప్రపంచం, అనుకోకుండా విక్రమ్ మొదటి చూపులోనే అనాధ పిల్లలు పట్ల మంచి స్వభావం వున్న ప్రేమ పెళ్లిళ్లు నమ్మకం లేని ఒక మంచి కుటుంబం వున్న అమ్మాయి అయినా మహాలక్ష్మి తో ప్రేమ లో పడతాడు విక్రమ్, ప్రేమలో పడ్డాక ఇద్దరి లవ్ ఎందుకు బ్రేక్ అయ్యింది, వీరి మధ్యలో ఆదిత్య ఎందుకు ఎంటర్ అయ్యాడు, జగ్గు భాయ్ కి అలాగే జగ్గు బాయ్ దగ్గర వుండే శాంభవి కి ఈ స్టోరీ కి సంబంధం ఏమిటి చివరికి హీరో తన ప్రేమ ని గెలుచుకున్నాడా లేదా తెలియాలి అంటే విక్రమ్ సినిమా థియేటర్ కి వెళ్లి చూడవలసిందే.
విశ్లేషణ :
విక్రమ్ క్యారెక్టర్ లో నాగ వర్మ ఒదిగి పోయాడు ఇది తనకి ఫస్ట్ ఫిల్మ్ అయిన చాలా ఎక్సపీరియన్స్ గా యాక్ట్ చేసాడు,నటన విషయం లోను,డాన్స్ విషయం లోను,ఫైట్స్ విషయం లోను అదరకొట్టాడు అని చెప్పాలి,ఇకపోతే హీరోయిన్ దివ్యారావు అనాధ పిల్లలు అన్న,అలాగే కనిపెంచి రోడ్డు మీద వదిలేసే పిల్లలు పట్ల తనకి శ్రద్ధ ఎక్కువ తనకి ఉన్నంత వరకు హెల్ప్ చేయాలి అనే మంచి అమ్మాయి అలాగే పెళ్లి పట్ల తన నిర్ణయం తన పేరెంట్స్ నిర్ణయం ఒకటే అనే మహాలక్ష్మి క్యారెక్టర్ లో చాలా మంచి మార్కులు కొట్టేసింది,ఆదిత్య ఓం చాలా కాలం తరువాత గ్రేట్ ఆదిత్య క్యారెక్టర్ లో బిజినెస్ మెన్ క్యారక్టర్ లో కధ కి కీలక మలుపు తిరిగే పాత్ర లో చాలా మంచి క్యారక్టర్ చేసాడు,సీనియర్ నటుడు సురేష్ మరియు నట కుమారి హీరోయిన్ తల్లి తండ్రులు గా ప్రేమ పెళ్లి ని వ్యతిరేకించే పాత్రలు బాగా పండించారు,అలాగే హీరో ఫ్రెండ్స్ క్యారక్టర్లు ప్లే చేసిన ఖయ్యుమ్,తాగుబోతు రమేష్ లు కధ కి చాలా హెల్ప్ అయ్యారు అని చెప్పాలి, కధ లో ఒక ట్విస్ట్ లాగా వచ్చే ఒక పాయింట్ దగ్గర వచ్చే పృథ్వి, జ్యోతి లు జగ్గు భాయ్, శాంభవి ల మధ్య హీరో తో వచ్చే సీన్ సినిమా కె హైలెట్ అని చెప్పాలి.
టెక్నిషియన్స్ పెర్ఫార్మన్స్ :
ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ బ్యానర్ ను స్థాపించి తనే హీరో మరియు ప్రొడ్యూసర్ గా చేసిన మొదటి ప్రయత్నం లోనే చాలా సక్సెస్ ఫుల్ అని నిరూపించుకున్నాడు,ఎక్కడ కూడా ప్రొడ్యూసర్ గా సినిమా కి అయ్యో ఖర్చు విషయం లో రాజి పడకుండా డైరెక్టర్ కి కావలసింది సమకూర్చాడు అని చెప్పాలి.మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ ప్రసాద్ ఈ సినిమా కి సాంగ్స్ విషయం లో కాని బ్యాక్ గ్రౌండ్ విషయం లో ప్రాణం పెట్టాడు అని చెప్పాలి, ఈ సినిమా కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా ని వేరే లెవెల్ కి తీసుకెళ్లింది, సాంగ్స్ కి గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ మధ్య లో వచ్చే లవ్ సాంగ్స్ అలాగే బ్రేక్ అప్ సాంగ్, ఆదిత్య ఓం సాంగ్ కి చాలా మంచి ట్యూన్స్ ఇచ్చాడు,సినిమాటోగ్రఫేర్ వేణు మురళి దర్ పనితనం చూడటానికి విజువల్ వండర్ లాగా వుంది, కోరియోగ్రాఫేర్ సత్య -కపిల్ శర్మ చాలా మంచి స్టెప్స్ వేయించారు, ఆర్ట్ డైరెక్టర్ బాబ్జి సినిమా కి తన వంతు కృషి చేసాడు, ఎడిటర్ శ్రీను కత్తెర బాగా పనిచేసింది ఈ సినిమా కి, ఇక పోతే కెప్టెన్ అఫ్ ది షిప్ హరి చందన్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్ని తనే అయ్యు నడిపించాడు, అసలు ఈ కధ ని కొత్త హీరో తో చేయటమే తనకి వున్న కాన్ఫిడెన్స్ లెవెల్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి అక్కడే డైరెక్టర్ గా తను సక్సెస్ అయ్యాడు, తనకి కావలసిన అవుట్ ఫుట్ అంత నటి నటులు దగ్గర మరియు టెక్నిషియన్స్ దగ్గర రాబట్టి సక్సెస్ అయ్యాడు.
రేటింగ్ :3.5/5