రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే మంచి సారాంశం ఉన్న కథలను ఎంచుకుంటూ ఎల్లప్పుడూ ప్రేక్షకులకు దగ్గరవుతాడు. ఇటీవలే నటించిన అన్ని సినిమాలు దాదాపు మంచి క్రేజ్ సంపాదించుకున్న విషయం అందరికి తెలిసిందే. కేవలం హీరోగానే కాకుండా విలన్ గా కూడా నటించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాడు.
తాజాగా విరాటపర్వం సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి మనముందుకొస్తున్నాడు. విరాటపర్వం గతేడాది ప్రథమార్థంలో షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ కరోనా మహమ్మారి కారంణంగా అన్ని సినిమాలలాగే ఈ సినిమా కూడా వాయిదా పడుతూ వచ్చింది. ఈ చిత్రంలో రానా నక్సలైట్ పాత్రలో మనకు విభిన్న పాత్రలో కనబడనుండగా..సాయిపల్లవి హీరోయిన్‌గా నటించింది.
ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ వదిలింది చిత్రబృందం. ఈ చిత్రాన్ని జూలై 1న విడుదల చేయనున్నట్లు మేకర్స అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మొదటగా అనుకున్న తేదీకంటే ముందుగానే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది.