విశాఖలో స్టూడియో చరణ్ కొత్త అడుగులు

విశాఖలో స్టూడియో చరణ్ కొత్త అడుగులు

0
100

కొణిదెల వారి కుమారుడు.
అపోలో వారి అల్లుడు.
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్ ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క నిర్మాతగా బిజీ అయ్యారు .అయితే చరణ్ కు కూడా బిజినెస్ అంటే చాలా ఇష్టం. ఆ అభిరుచి చిన్నతనం నుంచి ఉంది, అందుకే ఆయన పలురకాల వ్యాపారాలు చేస్తూనే సినిమాలు చేస్తున్నారు.

అయితే గతంలో ఓ వార్త వినిపించింది.. రామ్ చరణ్ ఓ ఫిల్మ్ స్టూడియో నిర్మించబోతున్నారు అని.. అది కూడా చిరు పేరు మీద ఉంటుంది అని. అయితే తాజాగా దీనికి సంబందించి వర్క్ స్టార్ట్ అయిందట. దాదాపు విశాఖనే ఫైనల్ చేశారు. విశాఖలో అతి ఖరీదైన ప్రాంతం ఆర్కే బీచ్ ఏరియా, అక్కడ 400 నుంచి 500 కోట్లతో ఫిల్మ్ స్టూడియోకి ప్లాన్ చేస్తున్నారట. తాజాగా సైట్ కూడా డిసైడ్ చేశారు అని తెలుస్తోంది, ఇక రాయితీల విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని త్వరలో కలవనున్నారట.