Vishal: అది పూర్తి అయిన తరువాతే నా పెళ్లి: విశాల్‌

-

Vishal gives clarity on his marriage gossips: తన పెళ్లిపై వస్తున్న వార్తలపై హీరో విశాల్‌ క్లారిటీ ఇచ్చాడు. నడిగర్‌ సంఘం భవనం నిర్మాణం పూర్తి అయిన తరువాతే పెళ్లి చేసుకుంటాననీ.. పెళ్లి చేసుకుంటే.. అందరికీ చెప్పే చేసుకుంటా అని విశాల్‌ వ్యాఖ్యానించాడు. కాగా గత కొన్నాళ్లుగా నటి అభినయతో విశాల్‌ ప్రేమలో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేసిన విషయం తెలిసిందే. కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌ అయితే ఓ మెట్టు ఎక్కి.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారనీ.. ఫలానా చోట పెళ్లి ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారంటూ ఊదరగొట్టేశాయి.

- Advertisement -

ఈ వార్తలపై విశాల్‌ ఎప్పుడూ స్పందించలేదు కానీ.. అభినయ మాత్రం ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పేసింది. తాము ఇద్దరూ మార్క్‌ ఆంటోనీ సినిమాలో కేవలం భార్యాభర్తలుగా నటించాము అని స్పష్టం చేశారు. రీల్‌ లైఫ్‌లో భార్యగా నటిస్తే.. రియల్‌ లైఫ్‌లో భార్య కాగలమా అంటూ మీడియాను ఘాటుగానే నిలదీసింది అభినయ. కానీ.. విశాల్‌ హీరోగా నటించిన లాఠీ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో అభినయ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో విశాల్‌ -అభినయ ప్రేమాయణ వార్తలు నిజమేనేమో అన్న వార్తలు మళ్లీ షికార్లు చేస్తాయని అనుకున్నాడో.. దీనిపై ఒక క్లారిటీ ఇవ్వాలని విశాల్‌ అనుకున్నాడో.. టీజర్‌ రిలీజ్‌ అనంతరం తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నడిగర్‌ సంఘం భవనం నిర్మాణం పూర్తి అయ్యాక, అందరికీ చెప్పే పెళ్లి చేసుకుంటా అని విశాల్‌ (Vishal) తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...