వైజాగ్ వచ్చిన తారక్ ఎందుకంటే చూడాలి మరి

వైజాగ్ వచ్చిన తారక్ ఎందుకంటే చూడాలి మరి

0
81

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో పెద్ద సెట్స్ పై జరుగుతోంది.. ఇఫ్పటికే రెండు టీమ్స్ గా షూటింగ్ ని శరవేగంగా చేస్తున్నారు రాజమౌళి..

తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం కొన్ని సన్నివేశాలను మన్యం ఏరియాలో చిత్రీకరించాలి అని భావిస్తున్నారు రాజమౌళి .. అందుకే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్ నుండి విశాఖకు వెళ్లారు.. ఇక విశాఖ తారక్ వస్తున్నారు అని తెలిసి అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చారు.

ఇక్కడ కొన్ని సెట్స్ వేశారట. ఇక్కడే దాదాపు మూడు రోజులు షూటింగ్ ఉంటుంది అని తెలుస్తోంది..
ఆయనకు జోడీగా ఒలివియా మోరిస్ నటించనుంది. ప్రధానమైన విలన్ పాత్రల కోసం ఐర్లాండ్కు చెందిన నటుడు రే స్టీవెన్సన్ను, ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నారు.అయితే వీరితో ఇక్కడ షూటింగ్ ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.