చాలా మంది పనిలేక ఇప్పుడు కోవిడ్ వైరస్ వ్యాప్తి చెండటంతో ఇంటికి మాత్రమే పరిమితం అయ్యారు సినిమా షూటింగులు లేవు చిన్న చిన్న పనులు చేసుకునే వారు జూనియర్ ఆర్టిస్టులు లైట్ మన్ నుంచి వ్యాన్ డ్రైవర్ వరకూ ఇలా 24 క్రాఫ్ట్ లో పని లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.
ఈ సమయంలో పేద కళాకారులని చాలా మంది ఆదుకుంటున్నారు. షూటింగులు వాయిదా పడడంతో ఇబ్బందులు పడుతున్న పేద కళాకారులను ఆదుకునేందుకు ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ముందుకొచ్చారు.
ఈ సమయంలో తన వంతు సాయంగా రూ. 5 లక్షలు విరాళం ప్రకటించారు. ఈ మేరకు కాదంబరి కిరణ్‌కు చెక్కును అందించనున్నట్టు తెలిపారు. ఎవరికి సరుకులు అవసరం ఉన్నా కిరణ్ ని సంప్రదించాలి అని తెలిపారు.. వివీ చేసిన ఈ సేవని పలువురు ప్రశంసిస్తున్నారు.