ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలో ద‌ర్శ‌కుడు వివి వినాయ‌క్

VV Vinayak is the director of the movie Pawan Kalyan

0
99

పవన్ కల్యాణ్ తో ఆయ‌న సినిమాలో న‌టించాలి అని చాలా మందికి కోరిక ఉంటుంది. ఇక ఆయ‌న‌తో సినిమా చేయాలి అని చాలా మంది ద‌ర్శ‌కులు కోరుకుంటారు. ఆయ‌న డేట్స్ ఇవ్వాలి అని నిర్మాత‌లు క్యూ క‌డ‌తారు. అయితే మ‌ళ్లీ సినిమాలు చేస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌లు సినిమాల‌కు సైన్ చేస్తున్నారు. వకీల్ సాబ్ త‌ర్వాత ఆయ‌న మూడు చిత్రాలు అనౌన్స్ చేశారు.

అయితే తెలుగులో మాస్ ప‌ల్స్ అందుకున్న ద‌ర్శ‌కుడు వి.వి వినాయ‌క్. తాజాగా ఆయ‌న గురించి ఓ వార్త వినిపించింది. ఆయ‌న ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలో న‌టిస్తున్నారు అనే వార్త‌. అయితే చాలా మంది ఇదంతా ఫేక్ న్యూస్ అనుకున్నారు. కానీ అది నిజమే. ఈ విషయాన్ని వినాయక్ స్వయంగా చెప్పారు.

ప‌వన్ కల్యాణ్ హీరోగా సాగర్ చంద్ర దర్శకత్వంలో మలయాళంలో హిట్ కొట్టిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రం తెలుగులో రీమేక్ గా రానుంది. ఈ రీమేక్ చిత్రంలో రానా కూడా ఓ కీల‌క పాత్ర చేస్తున్నారు. ఇందులో నేను ఒక చిన్న పాత్ర చేస్తున్నాను అని తెలిపారు వినాయ‌క్. ఈ చిత్రంలో తాను సినిమా డైరెక్టర్ గానే కనిపిస్తాను అని వినాయక్ చెప్పారు. సో ఈసినిమాలో ఇంకా చాలా మంది న‌టిస్తున్నారు అనే విష‌యం టాలీవుడ్ లో వైర‌ల్ అవుతోంది.