‘సర్కారు వారి పాట’ మూవీ రివ్యూ..

0
106

స్టార్‌ డైరెక్టర్‌ పరుశురాం దర్శకత్వంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్‌ బాబు, కీర్తి సురేష్ నటిస్తున్న “సర్కారు వారి పాట” గురువారం థియేటర్లలో విడుదలయి మహేష్ ఫాన్స్ ను అబ్బురపరిచింది. నవీన్ ఎర్నేని, వైరవిశంకర్ మరియు గోపి ఆచంట నిర్మాతలుగా బాధ్యతలు స్వీకరించి తెరెకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇక నిర్మాణ సంస్థల విషయానికి వస్తే మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లలో ప్రొడక్షన్ చేయడం జరిగింది.

ఈ సినిమా గురువారం థియేటర్లలో విడుదలయి పాజిటివ్ టాకుతో దూసుకుపోతుంది. మొదటగా ఈ సినిమా బ్యాంకింగ్ మోసాల నేపథ్యంలో మొదలయిన క్రమంలో మహేష్ ఇందులో యూఎస్ లో ఓ బ్యాంక్‌ లో రికవరీ ఎంప్లాయ్‌గా కొత్త పాత్రలో మనకు కనిపించనున్నాడు. ఈ సినిమాలో మహేష్ తమ బ్యాంకును చీట్ చేసిన బిజినెస్‌ మెన్‌ల నుంచి మహేష్ తెలివిగా డబ్బులు ఎలా వసూలు చేస్తాడనే విషయంపై ఉత్కంఠ నెలకొంటుంది.

ఇక పోతే సెకండాఫ్ విషయానికి వస్తే మహేశ్ మాస్ డైలాగ్స్ తో పాటు కామెడీ టైమింగ్ అందరిని కడుపుబ్బా నవ్విస్తాడు. రొమాన్స్, యాక్షన్, కామెడీ ఇలా అన్ని కోణాలలను చిత్రీకరించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ కూడా తన పాత్రలో జీవిస్తూ నటిస్తుంది. కీర్తిసురేష్ తన అందచెందాలతో సినిమాకు అట్రాక్షన్ గా మారింది. రెండున్నర గంటల సేపు కొనసాగిన ఈ సినిమా ఎన్ని కోట్ల  కలెక్షన్స్ తమ ఖాతాలో వేసుకుంటుందో చూడాలి మరి..