మెగావారి ఇంట మళ్లీ పెళ్లి సందడి నెలకొననుంది అని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి… ముఖ్యంగా నిహారిక పెళ్లి అయిన తర్వాత ఈ వార్తలు బలంగా వినిపించాయి.. అయితే సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లి కబురు మళ్లీ టాలీవుడ్ లో వినిపిస్తోంది, ఆయన పెళ్లి కోసం ఇప్పటికే కుటుంబ సభ్యులు సంబంధాలు చూస్తున్నారట.
మే నెలలో సాయి ధరమ్ తేజ్ పెళ్లి జరగబోతుందని తెలుస్తోంది, ఇక తాజా వార్తల ప్రకారం ఇప్పటికే అమ్మాయిని సెలక్ట్ చేశారు అని తెలుస్తోంది…ఇక అమ్మాయి మెగా ఫ్యామిలీకి తెలిసిన వారి కుటుంబం అమ్మాయి అని ….పెద్దలు కుదుర్చుతున్న వివాహం అని వార్తలు వినిపిస్తున్నాయి..
మెగా ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే అంటున్నారు అభిమానులు.. ఇక ప్రస్తుతం వరుసగా సినిమాలో బిజీగా ఉన్నాడు సాయి ధరమ్ తేజ్, దేవ్ కట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ అనే పొలిటికల్ థ్రిల్లర్ చేస్తున్నారు ఆయన.