మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ హైదరాబాద్ లో అతి పెద్ద స్టూడియో కడుతున్న విషయం తెలిసిందే.. ఇటీవలే దాని గురించి ప్రకటన కూడా చేశారు, టాలీవుడ్ లో బడా ప్రొడ్యూసర్ గా ఉన్న అల్లు అరవింద్ తన తండ్రి నుంచి సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు నిర్మాతగా నటుడిగా కూడా ఆయన చేశారు.ఇటీవల అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా అల్లు స్టూడియో నిర్మాణం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త వినిపిస్తోంది, మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ స్టూడియో నిర్మాణానికి చూస్తున్నారు అని మూడేళ్లుగా వార్తలు వినిపించాయి, రామ్ చరణ్ ఈ స్టూడియో నిర్మాణ బాధ్యతలు చూస్తారు అని వార్తలు వచ్చాయి, కాని దీనిపై ప్రకటన రాలేదు, అయితే ఇది ఏపీలో విశాఖలో నిర్మించాలి అని భావించారు.
వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవికి ఎప్పటి నుంచో ఫిల్మ్ స్టూడియో కట్టాలని ఉంది. గత కొంత కాలంగా దీని గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. అఫిషియల్ గా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త వినిపిస్తోంది, ఆయన విశాఖలో కాకుండా హైదరాబాద్ లో ఔటర్ లో ఓ స్టూడియో కట్టాలి అని చూస్తున్నారట.. సినిమా షూటింగ్లకు, రియాలిటీ షోలకు అనువుగా ఉండేలా సకల సౌకర్యాలతో దీనిని నిర్మించాలి అని చూస్తున్నారట. ఇక్కడ చిరు స్టూడియో నిర్మిస్తే రామ్ చ రణ్ విశాఖలో స్టూడియోకి ప్లాన్ చేస్తున్నారట.