War 2 | వార్-2 వాయిదా తప్పదా..?

-

వార్-2(War 2) విడుదల వాయిదా తప్పదా? మల్టీస్టారర్‌గా భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయా? స్టార్ హీరోకు గాయమవడమే ఇందుకు కారణమా? అంటే సినీ సర్కిల్స్ నుంచి అవునన్న సమాధానమే వినిపిస్తోంది. వార్-2తో హృతిక్ రోషన్, ఎన్‌టీఆర్‌ లను ఓకేసారి బిగ్‌స్క్రీన్‌పై చూడాలని దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వారికి ఈ వార్తలు పెద్ద షాక్‌లా తగిలాయి. తమ ఆశలపై నీళ్లు చిలకరించినట్లు అభిమానులు నీరసించిపోతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.

- Advertisement -

ఈ సినిమాలో హృతిక్(Hrithik Roshan), ఎన్‌టీఆర్(NTR) కలిసి ఓ పాటకు చిందేయనున్నారు. ఈ పాట మరో రికార్డ్ సృష్టిస్తుందని కూడా అంతా అనుకున్నారు. అయితే ఈ పాటకు రిహార్సల్స్ చేస్తుండగా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌కు గాయమైందట. ఆయన ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని, కొన్ని రోజులు బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారని టాక్ నడుస్తోంది. దీంతో ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులు ఆగనుందని, దాని ప్రభావంతోనే సినిమా(War 2) విడుదల కూడా ఆలస్యం కావొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై మూవీ టీమ్ ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Read Also: ‘ప్రియాంక’ను ఒంటరిగా వ్యాన్‌లోకి రమ్మన్న డైరెక్టర్
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Donald Trump | ట్రంప్‌కు భారత్ భారీ షాక్.. ఏం హామీ ఇవ్వలేదు..!

అగ్రరాజ్యం అమెరికాకు భారత్ భారీ షాక్ ఇచ్చింది. సుంకాల తగ్గింపుకు సంబంధించి...

Javed Akhtar | దక్షిణాది హీరోలను కించపరిచిన బాలీవుడ్ రచయిత..

భారతదేశ సినీ పరిశ్రమను ప్రస్తుతం దక్షిణాది సినిమాలు ఏలుతున్నాయి. బాలీవుడ్ సినిమాలకు...