క్రాక్ సినిమా చూసిన వారికి అందులో ఫైట్లు చాలా బాగా నచ్చాయి. ఇప్పటి వరకూ చూడని సరికొత్త ఫైట్లు ఇందులో కనిపించాయి. స్టోరీ కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే క్రాక్ సినిమాలోని గాడిద రక్తం ఫైట్ గురించి చాలా మంది మాట్లాడుకుంటారు. ఇది చాలా భయంకరంగా ఉంటుంది. ఇలా కూడా రౌడీలు ఉంటారా అనిపిస్తుంది.
టాలీవుడ్ నెంబర్ 1 ఫైట్ మాస్టర్స్ రామ్ – లక్ష్మణ్లు. ఇప్పటి సినిమాలు ఏవి వస్తున్నా అందులో ఫైట్ మాస్టర్లు అంటే వీరి పేరే వినిపిస్తుంది. ఇక క్రాక్ సినిమా గురించి చెబుతూ .ఒక బీచ్ పక్కన ఉండే ఒక మూర్ఖపు బ్యాచ్ని ఎంత క్రూరంగా చూపించాలో అంత క్రూరంగా చూపించాం.
వాళ్ల బాడీ లాంగ్వేజ్ని పర్ఫెక్ట్గా పట్టుకున్నాం. అయితే దీనికి ప్రేరణ, చీరాలలో మేం కూడా గాడిద రక్తం తాగి పరుగుపెట్టేవాళ్లం. ఫైటర్స్ గా ఉన్నప్పుడు గాడిద రక్తం తాగేవాళ్లం. శరీరానికి మంచిదని గాడిద రక్తం తాగుతుంటారు. ఇప్పుడు కూడా అది ఉంది.. స్టువర్టపురం దొంగలు గాడిద రక్తం తాగి, గాడిద చమురు పూసుకుని పరుగుపెట్టేవారు. ఇక ఇదే ప్రేరణగా ఫైట్ సీన్ పెట్టాం. ఇది ఆడియన్స్ కి బాగా నచ్చింది అని చెప్పారు ఈ బ్రదర్స్.