వెబ్ సిరీస్ పై ఫోకస్ చేస్తున్న మెగా హీరోయిన్…

వెబ్ సిరీస్ పై ఫోకస్ చేస్తున్న మెగా హీరోయిన్...

0
84

హీరోయిన్ అమలాపాల్ బెజవాడ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఆతర్వాత ఈ ముద్దుగుమ్మ పలు చిత్రాల్లో నటించి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. నాయక్, ఇద్దరమ్మాయిలతో, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాలు ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి… ఆతర్వాత అమలాపాల్ తమిళ మలయాళ చిత్రాలపై దృష్టి పెట్టింది…

ఇక్కడ దుకాణం సర్దేసిన కొద్ది రోజులకు అభిమానులకు షాక్ ఇచ్చింది దర్శకుడు విజయ్ ను వివాహం చేసుకుంది… అయితే వీరి వివాహ బంధం ఎక్కువ రోజులు నిలబడలేదు.. ఆతర్వాత కొన్ని రోజుల గ్యాప్ తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసింది.. వీఐపీ2 ద్వారా మళ్లీ ప్రేక్షకులకు దగ్గర అయింది… ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకున్నప్పటికీ అమలాపాల్ కు మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది…

ఇది ఇలా ఉండగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ వెబ్ సిరిస్ లో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి… కరోనా దెబ్బకు స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగింది… దీంతో చాలా మంది వెబ్ సిరీస్ లపై దృష్టి పెడుతున్నారు… ఇప్పుడు అమలాపాల్ కూడా వెబ్ సిరీస్ లో నటిస్తోందని వార్తలు వస్తున్నాయి… చూడాలి మరి డిజిటల్ ప్లాట్ ఫాంపై అమలాపాల్ ఎంతమేరకు సక్సెస్ అవుతుందో…