బిగ్ బాస్ 5- నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే..!

Weeley is in the Bigg Boss 5- nominations

0
102

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్‌-5 ఆసక్తికరంగా సాగుతోంది. ఆరో వారానికి సంబంధించిన నామినేషన్‌ ప్రక్రియ సోమవారం జరిగింది. నామినేషన్స్‌ ముందు ఇంటి సభ్యులు తీవ్ర చర్చల్లో మునిగిపోయారు. ఎవరిని నామినేట్‌ చేయాలి? ఎందుకు నామినేట్‌ చేయాలి? ఏం కారణాలు చెప్పాలంటూ ఒకరినొకరు చర్చించుకున్నారు. ఇదే విషయాన్ని అనీ మాస్టర్‌ చెబుతూ ‘నామినేషన్స్‌ అనేసరికి అందరూ ఎంత బాగా చర్చించుకుంటున్నారో’ అని అన్నారు.

ఇక కొత్త కెప్టెన్‌ ప్రియ, రేషన్‌ మేనేజర్‌ విశ్వల మధ్య ఫుడ్‌ విషయంలో చర్చ జరిగింది. రేషన్‌ మేనేజర్‌ అంటే అందరూ తిన్న తర్వాత తినాలని, వండి ఆహారం అందరికీ సమానంగా పంచాలని ‘ప్రియోపదేశం’ చేసింది. అందుకు విశ్వ.. తనకు కావాల్సిన మాత్రమే తాను పెట్టుకున్నానని, ఇతరుల ఆహారం తానెందుకు తింటానని అన్నాడు. మరోవైపు హమీదా వెళ్లిపోయిన బాధ శ్రీరామ్‌ను వదల్లేదనుకుంటా. అర్ధరాత్రి నిద్రలో ఒకటే కలవరింతలు మొదలు పెట్టాడు. పెద్ద పెద్దగా అరవడం వల్ల అతడికి ఏమైందా? అని కొందరు హౌస్‌మేట్స్‌ నిద్రలేచి చూశారు. విశ్వ అతడిని నిమురుతూ నిద్ర పుచ్చాడు.

బిగ్‌బాస్‌ సీజన్‌-5లో ఆరో వారానికి సంబంధించిన నామినేషన్స్‌ ప్రక్రియ జరిగింది. షణ్ముఖ్‌, ప్రియాంక‌, లోబో, శ్రీరామ్‌, రవి, సిరి, విశ్వ, శ్వేత, సన్నీ, జెస్సీ నామినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. మరి ఈ వారం ఎవరు సేవ్‌ అవుతారు? ఎవరు ఎలిమినేట్‌ అవుతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే!