రియాల్టీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్ విజేతగా అభిజిత్ నిలిచారు, ఆయన విజేతగా అఖిల్ రన్నరప్ గా నిలిస్తే, ఇక సెకండ్ రన్నరప్ గా సోహెల్ నిలిచారు, ఇక అభిజిత్ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు, ఇక పలు యూ ట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఈ సమయంలో ఆయనకు ఎవరు మద్దతుగా నిలిచారో వారికి అందరికి ధన్యవాదాలు తెలిపారు.
అయితే ఆయనకు హీరో విజయ దేవరకొండ కూడా సపోర్ట్ చేశారు అనే విషయం తెలిసిందే, దీనిపై అభిజిత్ మాట్లాడారు.
విజయ్ దేవరకొండ నా వాడు, నా స్నేహితుడు అంటూ వ్యాఖ్యానించాడు. విజయ్, తాను తరచుగా మాట్లాడుకుంటామని విజయ్ ఎంతో ప్రతిభావంతుడని, చాలా బాగా సినిమాలు చేస్తాడు అని ప్రశంసించాడు.
మేము శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో నటించామని గుర్తుచేసుకున్నాడు. ఆ సినిమాలో చేసిన ప్రతీ ఒక్కరు ప్రతిభావంతులు అని తెలిపారు అభిజిత్, ఈ సినిమాలో అభిజిత్ హీరోగా నటించారు, ఇక
విజయ్ దేవరకొండ నెగెటివ్ ఛాయలుండే చిన్న పాత్ర పోషించాడు. ఇక ఇద్దరూ ఆనాటి నుంచి మంచి మిత్రులుగా ఉన్నారు.