నవంబర్ 1న పునీత్ రాజ్​కుమార్ ఏం చెప్పాలనుకున్నారు?

What did Puneet Rajkumar want to say on November 1?

0
141

కన్నడ పవర్​స్టార్ పునీత్ రాజ్​కుమార్ హఠాన్మరణం సినీ లోకంతో పాటు అభిమానుల్ని తీవ్ర వేదనకు గురి చేసింది. పునీత్ ​మరణంతో చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ ప్రియులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పునీత్‌ జ్ఞాపకాలను సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేస్తున్నారు. దీంతో ఆయనకు సంబంధించిన ఎన్నో విశేషాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో పునీత్‌ చేసిన ఆఖరి ట్వీట్‌ ఏంటా అని అభిమానులు వెతుకుతున్నారు.

తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను తరచూ ట్విట్టర్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలలో షేర్‌ చేసేవారు పునీత్. ఈ క్రమంలోనే తన సోదరుడు శివరాజ్‌కుమార్‌ నటించిన ‘భజరంగీ-2’ విడుదలను పురస్కరించుకుని..చిత్రబృందానికి ఆల్‌ది బెస్ట్‌ చెబుతూ శుక్రవారం ఉదయం 7.33 గంటలకు పునీత్‌ ట్వీట్‌ చేశారు. అనంతరం జిమ్‌లో వర్కౌట్‌ చేస్తున్న ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో ‘పునీత్‌ చేసిన ఆఖరి ట్వీట్‌ ఇదే’ అంటూ నెటిజన్లు షేర్‌ చేస్తున్నారు.

ఇటీవల ‘యువరత్న’తో పునీత్‌ మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన రెండు ప్రాజెక్ట్‌లు ఓకే చేశారు. ప్రస్తుతం అవి చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన తన ఫేస్‌బుక్‌ ఖాతా వేదికగా నవంబర్‌ 1న ఓ స్పెషల్‌ అప్‌డేట్‌ ఇవ్వనున్నట్లు చెప్పారు. “దశాబ్దకాలం క్రితం ఓ కథ పుట్టింది. భవిష్యత్తు తరాల వారిలో స్ఫూర్తి నింపుతూ.. లెజెండ్ తిరిగి రావడానికి సమయం ఆసన్నమైంది” అని ఆయన రెండు రోజుల క్రితమే పోస్ట్‌ పెట్టారు.

ఆ పోస్ట్ చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి

https://twitter.com/PuneethRajkumar