‘మా’ ఎన్నికలపై రవిబాబు సంచలన కామెంట్స్..

0
100

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ల మధ్య మాటల యుద్ధం రోజురోజుకీ పెరుగుతోంది. ఒకరినొకరు పరస్పర ఆరోపణలతో ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ‘మా’ ఎన్నికలపై నటుడు, డైరెక్టర్ రవిబాబు స్పందించారు. మా నడపడం మనకు చేతకాదా. ఎవరో వచ్చి మనకు నేర్పించాలా? అధ్యక్షులుగా బయటివాళ్లు అవసరమా అంటూ హాట్ కామెంట్స్ చేశారు. దీనితో మళ్లీ ‘మా’ లో స్థానికత వివాదం తలెత్తింది. మంచు విష్ణు ను సపోర్ట్ చేస్తూ రవిబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది.