అనూహ్యాంగా ఈసారి బిగ్ బాస్ సీజన్ నుంచి ఇద్దరు బయటకు వచ్చారు, అనారోగ్య కారణాలతో ఇప్పటికే గంగవ్వ హౌస్ నుంచి బయటకు వచ్చింది, ఇక తాజాగా నోయల్ కూడా హౌస్ నుంచి బయటకు వచ్చారు, అనారోగ్యం కారణంగా ఆయన నిన్న బయటకు రావడం అందరం చూశాం, అయితే నోయల్ బాగా ఆడుతున్నా, అతనికి ఆరోగ్యం సహకరించడం లేదు, అయితే అతని సమస్య ఏమిటి అంటే.
చాలా కాలంగా కీళ్ల నొప్పుల కారణంగా వచ్చే సమస్యలతో బాధ పడుతున్నట్లు తెలుస్తుంది. ఎక్కువగా చలి ప్రదేశంలో ఉంటే ఆయనకు ఎముకలు, కీళ్లకు సంబంధించిన నొప్పులు వస్తాయి. అందుకే బిగ్ బాస్ హౌస్ లో ఆయన ఏసీ తగిలే చోట పడుకోవడం లేదు. సోఫా దగ్గర పడుకుంటున్నారు.
ఇక కండరాలు, భుజం నొప్పి కూడా పెరగడం, అడుగు వేయలేకపోవడంతో నోయల్ ని హౌస్ నుంచి బయటకు తీసుకువచ్చారు, ప్రస్తుతం ఆయన ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు, ఇక నాలుగు రోజుల్లో ఆయన కోలుకుంటే హౌస్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది.. లేకపోతే క్వారంటైన్ కు వెళ్లి మళ్లీ హౌస్ లోకి తీసుకురావాలి… అయితే ఇది అయ్యే పనికాదు అంటున్నారు బిగ్ బాస్ అనలిస్టులు.