టాలీవుడ్ యువ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అని కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి, అయితే గత నెల రోజులుగా అనేక వార్తలు వినిపించాయి.. ముఖ్యంగా మోహన్ బాబు కుటుంబానికి దగ్గర బంధువుల అమ్మాయి అని వార్తలు వినిపించాయి… కుటుంబ సభ్యులు చూసిన సంబంధం అని టాక్ నడిచింది. మొత్తానికి సోషల్ మీడియాలో అనేక వార్తలు రావడంతో దీనిపై స్పందించారు మంచు మనోజ్.
పెళ్లి తేదీ, ముహూర్త ఘడియలు కూడా మీరే చెప్పేయండి అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు మనోజ్… మొత్తానికి ఆయన పోస్టుతో పెళ్లి వార్తలపై ఓ క్లారిటీ అయితే వచ్చింది.. ఇదంతా ఉత్తి ప్రచారం అని అర్దం అయింది, ఇక ఆయన పెళ్లి వార్తల్లో నిజం లేదు అని తేలింది పోస్టుతో, దీంతో ఆయన అభిమానులు క్లారిటీ ఇచ్చినందుకు థాంక్స్ అన్న అంటున్నారు.
మనోజ్ 2015లో ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్నారు. 2019లో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఇక ఆయన ప్రస్తుతం సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు, ఇక ఆయన పెళ్లిపై వచ్చిన వార్తలు అన్నీ ఫేక్ అని అర్ధం అయింది.
|
|
|
హీరో మంచు మనోజ్ రెండో పెళ్లి వార్తలపై ఏమన్నారంటే
-