గంగవ్వ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత మరింత ఫేమస్ అయింది, హౌస్ లో ఆమె అందరిని తన ఆటతో ఆకట్టుకుంది.. ఉన్నది కొద్ది రోజులు అయినా అందరికి బాగా దగ్గర అయింది గంగవ్వ, ఇక ఆమె వయసు రిత్యా అక్కడ ఆ వాతావారణంలో ఉండలేకపోయింది, ఇక తాజాగా ఆమె తన ఇంటిని కూడా కట్టుకుంటోంది.
మై విలేజ్ షో నుంచి బిగ్ బాస్ వరకూ గంగవ్వ ప్రయాణం మనకు తెలిసిందే, ఇక బిగ్ బాస్ ఇచ్చిన నగదుతో పాటు నాగార్జున కూడా కొంత సాయం అందించారు, ఇక ఆమె తన దగ్గర ఉన్న నగదుతో సొంత ఇంటిని కట్టుకుంటుంది.
నాగార్జున నుంచి గంగవ్వకు 7 లక్షల చెక్ వచ్చింది. అలాగే బిగ్ బాస్ టీం నుంచి కూడా 10 లక్షలు వచ్చాయి. మొత్తం మరో 3 లక్షలు 20 లక్షలతో ఇల్లు కడుతోంది. అయితే ఆమెకి కొంతకాలంగా మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నాయి అందుకే ఆమె ఇప్పుడు హస్పటల్ కు వెళ్లింది…ఈమె కాళ్లను వైద్యులు పరీక్షిస్తున్న ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. కాళ్ల నొప్పులకి ఓసారి హస్పిటల్ లో చూపించుకుంది అయితే మరే అనారోగ్య సమస్య లేదట, ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు.