తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే.. ఆయన ఇక్కడ అన్నాత్తే షూటింగ్ లో పాల్గొన్నారు, రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది షెడ్యూల్, అయితే ఆయన అస్వస్ధతకు గురి అవ్వడంతో వెంటనే ఆయన హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు.
ఆసుపత్రిలో రజనీకి తోడుగా ఆయన కుమార్తె ఐశ్వర్య ఉన్నారు. చికిత్సలో ఆయనకు కరోనా నెగెటివ్ అని తేలింది. రెండు సార్లు పరీక్షలు చేశారు ఆయన కు నెగిటీవ్ అని వచ్చింది, కాని ఈరోజు ఉదయం నుంచి బీపి హెచ్చు తగ్గులు ఉంది.. దీంతో ఆయనని ఆస్పత్రిలో చేర్పించారు.
ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ప్రొడక్షన్ సభ్యులకు టెస్టులు నిర్వహించగా ఎనిమిది మందికి కరోనా సోకినట్టు తేలింది. దీంతో షూటింగుకి బ్రేకు పడంది, ఈ సమయంలో రజనీ కూడా
స్వీయ నిర్బంధంలో ఉన్నారు. వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ వార్త విని రజనీ అభిమానులు ఆందోళన చెందారు, ఎవరూ కంగారు పడవద్దని ఆయనకు
బీపీ మినహా ఇతర ఆరోగ్య సమస్యలు లేవు అని బులెటిన్ లో వైద్యులు తెలిపారు.